కాంగ్రెస్ పార్టీలో నటి నగ్మకు కీలక పదవి!

కాంగ్రెస్ పార్టీలో నటి నగ్మకు కీలక పదవి!

Published on Oct 7, 2015 5:49 PM IST

nagma1
తెలుగు, తమిళంలో పలువురు టాప్ హీరోలతో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నగ్మ, గత కొద్దికాలంగా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. నటనకు దాదాపుగా ఫుల్‌స్టాప్ పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కీ రోల్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న నగ్మకు పార్టీ ఓ ప్రధాన పదవిని కట్టబెట్టడం విశేషంగా కనిపిస్తోంది.

గత కొన్నాళ్ళుగా పార్టీకి చేస్తోన్న సేవలకు గుర్తింపుగా నగ్మను మహిళా కాంగ్రెస్‍కు ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఎంపిక చేసింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో మహిళా కాంగ్రెస్‌కు సంబంధించిన సభ్యుల ఎంపిక జరిగింది. నగ్మ గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో కూడా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ తరపున మహిళల హక్కుల కోసం చాలాకాలంగా పోరాడుతున్న నగ్మను, పార్టీ ఓ ఉన్నత పదవితో అలంకరించడం ఆమె అభిమానులను, కాంగ్రెస్ శ్రేణులనూ ఉత్సాహపరిచింది.

తాజా వార్తలు