యూత్‌ ను టార్గెట్ చేయబోతున్న నమిత !

Published on Jul 11, 2018 10:15 am IST

పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించడంతో పాటు ఆ సినిమాలను నిర్మించిన ప్రముఖ దర్శక నిర్మాత టీ.రాజేంద్రన్‌ చాలా సంవత్సరాల తర్వాత ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వంతో పాటు సంగీతం, కెమెరా పర్యవేక్షణ కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి ఇన్రైయ కాదల్‌ డా అని పేరును పెట్టారు.

కాగా ఈ చిత్రంలో హీరోయిన్ నమిత లేడీ డాన్‌ గా నటిస్తోందని, నమితతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారని టీ.రాజేంద్రన్‌ తెలిపారు. యూత్‌ ఫుల్‌ లవ్‌స్టోరీతో వస్తున్న ఈ చిత్రం యూత్‌ ని టార్గెట్ చేస్తూ వారిని ఆకట్టుకున్నే విధంగా తెరకెక్కబోతుందని రాజేంద్రన్‌ పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం :