350 రోజుల.. బాలయ్య ‘లెజెండ్’!

350 రోజుల.. బాలయ్య ‘లెజెండ్’!

Published on Mar 13, 2015 12:04 AM IST

legend_movie
గత సంవత్సరం వేసవి కానుకగా విడుదలై.. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా, ‘లెజెండ్’. మార్చి 28, 2014న విడుదలైన ఈ సినిమా నేటితో 350 రోజులు పూర్తి చేసుకొని, సంవత్సరం పూర్తి చేసుకునే దిశగా దూసుకుపోతోంది. ఇటు కలెక్షన్ల పరంగానూ, అటు విమర్శకుల ప్రశంసల పరంగానూ సూపర్ అనిపించుకున్న లెజెండ్.. లాంగ్ రన్‌లో కూడా స్టడీగా నిలబడింది. ప్రస్తుతం ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరులో ప్రదర్శితమౌతోన్న ఈ సినిమా ఈనెల 28తో సంవత్సరం పూర్తి చేసుకోనుంది. ఇదే సందర్భంగా బాలయ్య కొత్త సినిమా ‘లయన్’ ఆడియోనూ, ‘లెజెండ్’ విజయోత్సవ వేడుకనూ ఒకేసారి నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక బాలయ్య తాజా చిత్రం లయన్ విషయానికి వస్తే.. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తైన ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా సాటిలైట్ రైట్స్ 6కోట్ల రూపాయలకు అమ్ముడై సినిమాపై అంచనాల్ని పెంచింది. సత్యదేవా దర్శకుడిగా పరిచమవుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చారు.

తాజా వార్తలు