టీజర్ తో రాబోతున్న ‘రూలర్’ !

Published on Nov 21, 2019 12:30 am IST

కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం ‘రూలర్’. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతొంది ఈ చిత్రం. కాగా చిత్రబృందం ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేస్తోంది. తాజాగా టీజర్ రిలీజ్ టైంను ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం 4 గంటల 28 నిముషాలకు టీజర్ ను విడుదల చేస్తోన్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఇక `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత కె.ఎస్‌.రవికుమార్‌ – బాలయ్య హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డతారు. ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌ పై సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More