రెండో షెడ్యూల్ కి సిద్ధం అవుతున్న నందమూరి హీరో సినిమా !

రెండో షెడ్యూల్ కి సిద్ధం అవుతున్న నందమూరి హీరో సినిమా !

Published on Dec 5, 2018 1:32 AM IST

Nandamuri Tarakaratna

నంద‌మూరి తార‌క‌ర‌త్న‌, మేఘ శ్రీ జంట‌గా చాందిని క్రియేష‌న్స్ ప‌తాకం పై శివ‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌రాజు నెక్కంటి తెలుగు,క‌న్న‌డ భాష‌ల్లో నిర్మిస్తున్న చిత్రం `అమృత వ‌ర్షిణి`. ఈ చిత్రం ఇటీవలే మొదటి షెడ్యూల్ షూటింగ్ ను పూర్తీ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీ నుండి రెండో షెడ్యూల్ ను కూడా ప్రారంభించనుంది చిత్రబృందం.

కాగా తారక్ రత్నకి ఈ చిత్రం మంచి హిట్ ఇస్తోందని.. ఇది ఇంటెన్స్ ఉన్న స్టోరి.. అన్ని ర‌కాల ఎమోష‌న్స్ తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది. మరి ఈ చిత్రంతోనైనా తారక్ రత్న హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ : స‌భా కుమార్‌, ఎడిటింగ్ : శివ‌ప్ర‌సాద్ యాద‌వ్, ఇక సంగీత దర్శకుడు జెస్సీ గిప్ట్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని నాగ‌రాజు నెక్కంటి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు