నందినీ రెడ్డి కొత్త సినిమాపై నిజమైన పుకార్లు..!

Published on Jul 6, 2021 2:46 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి యంగ్ హీరో సంతోష్‌ శోభన్‌తో సినిమా చేయబోతున్నారని గత కొద్ది రొజులుగా వినిపిస్తున్న పుకార్లు నిజమయ్యాయి. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఓ బేబీ’ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆమె తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసింది. ‘అన్నీ మంచి శకునములే’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.

ఇక ఈ సినిమాలో సంతోష్‌ శోభన్ సరసన మాళ‌విక నాయ‌ర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాజేంద్ర ప్ర‌సాద్, రావు ర‌మేష్, న‌రేష్, వెన్నెల కిషోర్‌లు ముఖ్య‌పాత్ర‌ల్లో నటిస్తున్నారు. స్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఇకపోతే మారుతి ద‌ర్శ‌క‌త్వంలో హీరో సంతోష్‌ శోభన్‌ చేసిన ‘మంచి రోజులు వ‌చ్చాయి’ సినిమా త్వరలోనే డిజిటల్ వేదికగా రిలీక్ కానుంది.

సంబంధిత సమాచారం :