పవర్ ఫుల్ రోల్ లో బెంగుళూరు బ్యూటీ !

Published on Mar 6, 2019 12:54 pm IST

ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్ నందిత శ్వేతా ప్రస్తుతం తెలుగు , తమిళ భాషల్లోకలిపి అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇక ఇటీవలే ఆమె మరో కొత్త సినిమాకి సైన్ చేసింది. రామ్ కుమార్ సుబ్బరామన్ తెరకెక్కిస్తున్న ఐపీసీ 376 అనే చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తుంది నందిత. ఈ చిత్రంలో ఆమె పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. క్రైమ్ నేపథ్యంలో రానున్న ఈచిత్రం యొక్క పోస్టర్లు విడుదలయ్యాయి.

ఇక ఈ పోస్టర్లను చాలా బాగా డిజైన్ చేశారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పవర్ స్టూడియో పతాకం ఫై ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఈచిత్రం తోపాటు నందిత ప్రస్తుతం తెలుగులో ప్రేమ కథా చిత్రమ్ 2 అలాగే అక్షర చిత్రాల్లో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More