థ్రిల్లర్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న నందిత రాజ్ !

Published on Jul 2, 2018 12:01 pm IST

‘గీతాంజలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నా రాజ్ కిరణ్ మరొక థ్రిల్లర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ నందిత రాజ్ టైటిల్ రోల్ చేయనుంది. ఒకప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు చేసే దర్శకులకు, నిర్మాతలకు ఫేవరెట్ హీరోయిన్ గా ఓక్ వెలుగు వెలిగిన ఈమె ఈ మధ్య సరైన హిట్ లేక వెనుకబడిపోయింది.

గత కొన్నెళ్లుగా చెప్పుకోదగిన సినిమాలేవీ చేయని ఈమెకు ఇప్పుడు చేయబోయే ఈ థ్రిల్లర్ రీ ఎంట్రీ లాంటిదని చెప్పొచ్చు. అమెరికా, స్విట్జర్ లాండ్ వంటి దేశాల్లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపోందిస్తున్నారు రాజ్ కిరణ్. ‘జక్కన్న’ చిత్ర దర్శకుడు ఆకెళ్ల వంశీ కృష్ణ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రాన్ని మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్ లు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :