లేటెస్ట్ బజ్ : ఆ రోజున లాంచ్ కానున్న నాని 30వ మూవీ ?

Published on Jan 28, 2023 3:03 am IST


నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ దసరా. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ మార్చి 30న గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది. అయితే దీని తరువాత తన కెరీర్ 30వ సినిమాని ప్రారంభించనున్నారు నాని. ఇటీవల ఈ మూవీని ప్రకటించారు నాని.

వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల, కేఎస్ మూర్తి సంయుక్తంగా నిర్మించనున్న ఈ మూవీకి నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించనుండగా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటించనున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఈ ప్రతిష్టాత్మక మూవీ ఫిబ్రవరి 1న గ్రాండ్ గా లాంచ్ కానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. కాగా సను జాన్ వరుగేసే ఐఎస్సి కెమెరా మ్యాన్ గా వర్క్ చేయనున్న ఈ మూవీకి పాపులర్ మలయాళం కంపోజర్ హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించనున్నారు. ఇక అతి త్వరలో మూవీ లాంచ్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :