నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఫీల్డ్ గుడ్ రొమాంటిక్ మూవీ హాయ్ నాన్న. ఈ చిత్రాన్ని డిసెంబర్ 7, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా పై మంచి హైప్ కూడా వచ్చింది. తాజాగా ఈ చిత్రం కి సంబందించిన విషయాలను ఆడియెన్స్ కు వెల్లడించేందుకు రెడీ అయిపోయారు నాని.
తాజాగా వెంకీ మామ తో చిట్ చాట్ వీడియో ను రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే వెంకీ మామ షేర్ చేసిన పోస్ట్ పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. మనం ఒకరిని చూస్తూ ఎదిగిన వాళ్ళతో కూర్చొని మాట్లాడటం డిఫరెంట్ ఫీలింగ్ అని అన్నారు. హాయ్ నాన్న మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా, హేషం అబ్ధుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
It’s a different feeling to sit with someone and have a chat who you look up to and grown up watching ♥️#HiNanna #Saindhav https://t.co/orpC59mrEV https://t.co/QtHOaEkaY5
— Hi Nani (@NameisNani) December 5, 2023
