“తిమ్మరుసు” ప్రీ రిలీజ్ వేడుక కి చీఫ్ గెస్ట్ గా “నాని”

Published on Jul 27, 2021 5:40 pm IST

సత్యదేవ్ వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతున్నారు. ఇప్పటికే పలు చిత్రాలను లైన్ లో పెట్టిన సత్యదేవ్, ప్రస్తుతం తిమ్మరుసు చిత్రం తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల అయిన సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ఈ ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నేడు సాయంత్రం ఏడు గంటలకు జరగనుంది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తిమ్మరుసు చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక కి న్యాచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. అయితే సత్యదేవ్ సరసన హీరోయిన్ గా ఈ చిత్రం లో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :