ప్యారడైస్ ఎఫెక్ట్.. రూట్ మారుస్తున్న నాని..?

ప్యారడైస్ ఎఫెక్ట్.. రూట్ మారుస్తున్న నాని..?

Published on Oct 3, 2026 11:00 PM IST

న్యాచురల్ స్టార్ నాని గతంలో పక్కింటి కుర్రాడు తరహా పాత్రలతో ప్రేక్షకుల గుర్తింపు పొందాడు. అయితే రానురానూ తన రూట్ మార్చి ‘దసరా’, ‘సరిపోదా శనివారం’, ‘ప్యారడైజ్’ వంటి చిత్రాలతో పూర్తిస్థాయి మాస్, యాక్షన్ హీరోగా మారి తన మార్కెట్‌‌ను పెంచుకున్నాడు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో కాస్త క్లాస్ టచ్ ఉన్న యాక్షన్ కథ ‘బ్లడీ రోమియో’లో నటిస్తున్న ఆయన, ఇకపై మాస్ యాక్షన్ నుంచి కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట.

అభిమానుల నుంచి వస్తున్న సలహాలు, క్లాస్ కథలకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని నాని మళ్లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా శివ నిర్వాణ, వెంకీ అట్లూరి వంటి క్లాస్ చిత్రాల దర్శకులతో సినిమాలు చేయడానికి చర్చలు జరుపుతున్నాడట. యాక్షన్‌ను పూర్తిగా వదలకుండా, అప్పుడప్పుడు ట్రై చేస్తూనే.. రాబోయే సినిమాల్లో మాత్రం మళ్లీ పాత నానిలా క్లాస్, పక్కింటి కుర్రాడి పాత్రల్లోనే అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు