ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ కాంబినేషన్లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ రాకా కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని ఒక గ్లోబల్ ఫినామినాగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన చాలామంది స్టార్ హీరోయిన్స్ కనిపిస్తారు అని కూడా తెలుసు.
దీపికా, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ ఇలా స్టార్ హీరోయిన్స్ కూడా లైన్ లో ఉన్నారు. అయితే వీరితో పాటుగా మరో ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లెక్ష్మీ కూడా ఉంది అనే రూమర్స్ ఉన్నాయి. అయితే వీటిపై ఆమె ఫైనల్ గా స్పందించింది.
తాను ఈ సినిమా తారగణంలో లేను అని కానీ నన్నెవరైనా ఈ సినిమాలో చేర్చండి అంటూ ఫన్ రిప్లై ఇచ్చింది. సో ఈ హీరోయిన్ ప్రెజెన్స్ రాకా లో లేనట్టే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


