మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన గత సినిమా దేవర కోసం తెలిసిందే. ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించింది. అలాగే ఆమె నటించిన మొదటి తెలుగు సినిమా కూడా అదే. అయితే ఈ సినిమాలో ఆమె గ్లామరస్ పార్ట్ పాటల్లో బాగా వర్కవుట్ అయ్యింది. అయితే దర్శకుడు కొరటాల శివ ఎక్కడా శృతి మించకుండా ప్రెజెంట్ చేసిన సాంగ్స్ లో చుట్టమల్లే కూడా ఒకటి.
అనిరుద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ పెద్ద హిట్. ఆడియో వీడియో పరంగా హిట్ అయ్యిన ఈ సాంగ్ విషయంలో జరిగిన ఓ దారుణం పట్ల హీరో ఎన్టీఆర్ ఫైర్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఏఐ వాడకం ఎంత ప్రమాదకరంగా మారింది అనేది ఈ ఘటనకు నిదర్శనం. ఈ పాటను ఎవరో ఆకతాయి జాన్వీపై దారుణంగా ఏఐ తో మార్చేశాడు. తీరా అది సోషల్ మీడియాలో ఒక బాంబ్ లా స్ప్రెడ్ అయింది. దీన్ని చూసినవారు కూడా సర్క్యులేట్ చేసారు. దీనితో సహించని తారక్ తన స్పందనను ఘాటు గానే ఇచ్చాడు.
‘అసహ్యకరమైన, అనారోగ్యకరమైన మరియు సిగ్గులేని చర్య ఇది అంటూ మొదలు పెట్టి, స్త్రీలను తల్లులుగా మరియు దేవతలుగా ఆరాధించే దేశంలో, “మాతృదేవో భవ” అనేది కేవలం ఒక పదబంధం కాదు, మన సంస్కృతిలో ఒక భాగం. చాలామంది ఆలోచనా విధానం దారుణంగా పడిపోయింది, స్త్రీని అగౌరవపరచడానికి AI ని ఉపయోగించడం సాధ్యమైనంత అవమానకరమైన మార్గం. ఈ అసహ్యకరమైనదాన్ని సృష్టించడానికి Al ని ఉపయోగించడం అనేది మాటల్లో కూడా చెప్పడానికి వీలు లేని హేయమైన చర్య.
ఈ సర్క్యులేట్ అవుతున్న చుట్టమల్లె వీడియో వెనుక ఉన్న దుర్మార్గాలకు, నేను మీలో ఎవరినీ విడిచిపెట్టను. దీన్ని క్రియేట్ చేసిన వారిపై మరియు దానిని వ్యాప్తి చేస్తున్న వారిపై నేను సాధ్యమైన ప్రతి చట్టపరమైన చర్య తీసుకుంటాను. దయచేసి అటువంటి కంటెంట్ ను చూడకండి, షేర్ చేయవద్దు లేదా దానితో నిమగ్నమై ఉండకండి. ఈరోజు అది వేరే వ్యక్తి. రేపు, అది మీ తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తె కావచ్చు.
ఇది ఒక తీవ్రమైన సమస్య, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు భారత ప్రభుత్వం బలంగా వ్యవహరించాలని మరియు అల్ దుర్వినియోగంపై కఠినమైన నిబంధనలను తీసుకురావాలని నేను కోరుతున్నాను.’ అని తారక్ ముక్కలైన హృదయంతో బలంగా చెప్పాడు. దీనితో జాన్వీకి తన తోటి నటుడుగా తన వంతు గొంతు అందించి అండగా నిలబడ్డాడు. మరి మిగతా స్టార్స్ కూడా స్పందిస్తారో లేదో చూడాలి.
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using…
— Jr NTR (@tarak9999) October 3, 2026


