నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ది ప్యారడైజ్. విడుదలకి ముందు భారీ హైప్ లో వచ్చిన ఈ సినిమా కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ నాని మాత్రం తన పుల్ తో లాక్కొచ్చేస్తున్నాడు. ఇక ఇలా నైజాం మార్కెట్ లో కూడా ఈ సినిమా సాలిడ్ వసూళ్లు రాబడుతుంది.
లేటెస్ట్ పి ఆర్ లెక్కల ప్రకారం డే 9 సినిమా సుమారు 80 లక్షల దగ్గర షేర్ ని రాబట్టినట్టు తెలుస్తోంది. దీనితో మొత్తం 37 కోట్లకి పైగా షేర్ ని ఈ సినిమా అందుకున్నట్టు టాక్. దీనితో ప్యారడైజ్ నైజాం మార్కెట్ లో మాత్రం బాగానే పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పొచ్చు. పవర్ఫుల్ పాత్రలో మోహన్ బాబు ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించారు.


