కన్నడ నటుడు రక్షిత్ శెట్టి పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయంలేని పేరు. కన్నడలో ఈయన నటించిన ‘కిరిక్ పార్టీ’ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘కిరాక్ పార్టీ’ పేరుతో నిఖిల్ రీమేక్ చేశాడు. అయితే రక్షిత్ కొత్తగా చేసిన సినిమాను కన్నడంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు.
‘కె.జి.ఎఫ్’ సినిమా ద్వారా కన్నడ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి గుర్తింపు రావడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. తెలుగులో ‘అతడే శ్రీమన్నారాయణ’ పేరుతో ఈ సినిమా వస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ ను ఈ నెల 28న తెలుగులో నాని, తమిళంలో ధనుష్, మలయాళంలో నివిన్ పౌలీ విడుదల చేయనున్నారు. ఇలా స్టార్ స్టేటస్ ఉన్న హీరోలు మద్దతుగా నిలవడం ఆయా భాషల్లో ఈ రక్షిత్ శెట్టికి కలిసొచ్చే విషయమనే అనాలి. సచిన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 27న రిలీజ్ కానుంది.


