సూర్యను డామినేట్ చేస్తున్న నాని!

సూర్యను డామినేట్ చేస్తున్న నాని!

Published on Apr 23, 2025 10:03 PM IST

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ వేసవి కానుకగా మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను నాని తన భుజాలపై వేసుకుని చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఇతర భాషల్లోనూ హిట్-3 ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇక మే 1న తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘రెట్రో’ మూవీ కూడా రిలీజ్ కానుంది.

‘కంగువా’ డిజాస్టర్ తర్వాత సూర్య నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం అనుకున్నంత స్పీడ్‌గా చేయలేకపోతున్నారు. తమిళ్‌లో పర్వాలేదు గాని.. తెలుగులో ఈ చిత్ర ప్రమోషన్స్ పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో ఈ సినిమాకు ఇక్కడ ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక రెట్రో సినిమాను తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం విశేషం. మరి ఈ సినిమాపై తెలుగులో సాలిడ్ బజ్ క్రియేట్ చేయాలంటే మేకర్స్ మరింత గ్రాండ్ ప్రమోషన్స్ చేయాల్సిందే. ప్రమోషన్స్ విషయంలో నాని సూర్యను డామినేట్ చేశాడనేది వాస్తవం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు