నాని డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనా.?

నాని డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనా.?

Published on Oct 26, 2015 8:25 AM IST

nani2

సౌత్ సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది నటీనటులకు సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ అయిన మణిరత్నం సినిమాలో నటించాలని, కనీసం ఓ చిన్న పాత్రలో అన్నా కనిపించాలని ఆశపడుతుంటారు. అలాంటి చాలా మంది స్టార్స్ లో టాలీవుడ్ యంగ్ హీరో నాని కూడా ఒకరు. ఇప్పటికే నాని చాలా సార్లు, మణిరత్నంతో ఓ సినిమా చేయాలని ఉందని తెలిపాడు. అందులో భాగంగానే మొదటగా నానికి ఓకే బంగారం సినిమాలో దల్క్వేర్ సల్మాన్ కి డబ్బింగ్ చెప్పే అవకాశం దక్కింది. ఆ అవకాశంతో మణిరత్నం గత కొద్ది రోజులగా చేయాలనుకుంటున్న ఓ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ లో మెయిన్ హీరోగా నటించే అవకాశం నానికి వచ్చింది.

మణిరత్నంతో చేయాలనుకున్న డ్రీమ్ నేరవేరబోతుండడంతో నాని కూడా చాలా సంబరపడి ఈ సినిమాకి సైన్ చేసేసాడు. కానీ ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కానీ ఇప్పుడు నాని డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఏమైందో తెలియదు గానీ మణిరత్నం ఈ మల్టీ స్టారర్ సినిమాలు చెయ్యాలనే ఆలోచనని పూర్తిగా మానుకున్నాడు. అంతే కాకుండా ధనుష్ తో ఓ సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. దీంతో నాని తన డ్రీమ్ రోజేచ్ట్ మిస్ అయ్యిందని కాస్త బాధలో ఉన్నాడు. నాని ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

తాజా వార్తలు