కొద్ది రోజులు షూటింగ్ లకి గ్యాప్ ఇచ్చిన యంగ్ హీరో నాని ఇప్పుడు కంటిన్యూగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. శేఖర్ కమ్ముల దగ్గర పనిచేసిన నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేస్తున్న ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాని సరసన ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘నా రాకుమారుడు’ ఫేం రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాలోని కొంత కీలక భాగాన్ని నేపాల్ లో షూట్ చేస్తున్నారు. నాని, రీతు వర్మలతో పాటు ఈ మూవీలో కీలక పాత్రలు చేస్తున్న నటులందరూ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ నేపాల్ షెడ్యూల్ తో చాలా వరకూ షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు. గతంలో ‘స్టూడెంట్ నెం.1’ లాంతో సూపర్ హిట్ మూవీని అందించిన స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రీతు వర్మతో పాటు మలయాళ భామ మాళవిక నాయర్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇది కాకుండా నాని హను రాఘవపూడి డైరెక్షన్ లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.


