‘గ్యాంగ్ లీడర్’ది దొంగల నేపథ్యం !

Published on May 17, 2019 1:00 am IST

‘గ్యాంగ్ లీడర్’ అనే మాస్ టైటిల్ తో నేచురల్ స్టార్ నాని హీరోగా – స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ విక్రమ్ కుమార్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో వుంది.

అయితే ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని దొంగగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా అమ్మాయిల దొంగల గ్రూప్ కి నానినే లీడర్ అట. సినిమాలో దొంగతనం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా కామెడీగా సాగుతాయని సమాచారం.

ఇక ఈ సినిమాలో నాని సరసన చెన్నై బ్యూటీ మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :

More