టీజర్: గ్యాంగ్ లీడర్- కామెడీ గ్యాంగ్ రివేంజ్ డ్రామా

Published on Jul 24, 2019 11:53 am IST

నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “గ్యాంగ్ లీడర్” మూవీ టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. మూవీ ఫస్ట్ లుక్ తోనే చిత్రం పై ఆసక్తి కలిగేలా చేశారు దర్శకుడు. “గ్యాంగ్ లీడర్” లాంటి మాస్ పవర్ ఫుల్ టైటిల్ పెట్టి విభిన్న ఏజ్ గ్రూప్స్ తో కూడుకున్నలేడీ గ్యాంగ్ ని పరిచయం చేశాడు. టీజర్ కూడా అంచనాలకు అందకుండా డిఫరెంట్ గా కట్ చేశారు.

టీజర్ ఆహ్లాదకరమైన బీజీఎమ్ తో స్టార్ట్ అవుతుంది. పెన్సిల్ అనే పెన్ నేమ్ కలిగిన రివేంజ్ రైటర్ గా నాని తన పాత్రను పరిచయం చేసుకున్నాడు. ఈ రివేంజ్ రైటర్ దగ్గరకి ప్రతీకారంతో రగిలిపోతున్న ఓ పాప,వృద్ధురాలు, ఓ గృహిణి తో పాటు ఇద్దరు యంగ్ లేడీస్ తో కూడిన లేడీ గ్యాంగ్ వస్తుంది. అప్పటినుండి రైటర్ నాని వారి పగకోసం వారితో కలిసి పనిచేస్తుంటాడు.
ఈ ఐదుగురి ప్రతీకారం ఎవరిపై?, వారి పగలో సహాయం చేయడానికి రచయితను ఎందుకు కలిశారు? అనేది ఆసక్తికరంగా ఉంది. సీనియర్ నటులు శరణ్య,లక్ష్మీ పాత్రలు చూస్తుంటే కామెడీగా సాగే రివేంజ్ డ్రామా అని అర్థం అవుతుంది. హీరో కార్తికేయ ఫార్ములా వన్ రేసర్ లా కనిపించారు. ఇక అనిరుద్ అందించిన బీజీఎమ్ చాలా బాగుంది. నాని మార్కు నటనతో టీజర్ చాలా ఆసక్తికరంగా సాగింది.

నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా, వెన్నెల కిషోర్,ప్రియదర్శి,రఘుబాబు,ప్రాణ్యా, సత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీ మాత్రం ప్రకటించలేదు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :