ఆగస్టు 30 న “గ్యాంగ్ లీడర్”గా రానున్న నాని.

Published on May 17, 2019 3:09 pm IST

మైత్రీ మూవీస్ బ్యానర్ పై ప్రయోగాత్మక దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం”గ్యాంగ్ లీడర్”. విలేకరులతో సమావేశమైన చిత్ర యూనిట్ తమ మూవీ “గ్యాంగ్ లీడర్” గురించి అనేక విషయాలు వెల్లడించారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ మా బ్యానర్ లో వస్తున్న మరో విభిన్న కథా చిత్రం “గ్యాంగ్ లీడర్”. ఈ నెల 14న శంషాబాద్ లో మొదలైన మూడవ షెడ్యూలు జరుగుతూ ఉంది. జూన్ 30 కల్లా మొత్తం చిత్రీకరణ పూర్తి చేసి, ఆగస్టు 30 కి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించాం అన్నారు.

చిత్ర దర్శకుడు విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ “ఇప్పటివరకు ఎవరూ చూపించని భిన్నమైన కోణం ఉన్న ఫ్యామిలీ ఎటెర్టైనర్ ఇది. ఆ భిన్నమైన కోణం ఏమిటనేది థియేటర్లో స్రీన్ పై చుస్తే బాగుంటుంది. టెక్నికల్ గా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్న చిత్రం “గ్యాంగ్ లీడర్” అన్నారు.

ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర “ఆర్ఎక్స్ 100” ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌

సంబంధిత సమాచారం :

More