నాని ‘గ్యాంగ్ లీడర్’ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ..!

Published on Jul 13, 2019 3:00 am IST

హీరో నాని తన తదుపరి చిత్రంగా విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో “గ్యాంగ్ లీడర్ ” మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలకపాత్ర చేస్తుండగా ప్రియాంక అరుళ్ మోహన్ నాని సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే ఎప్పుడో చిత్రీకరణ మొదలైన ఈ చిత్రం పై అభిమానులకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఒకింత అసహనానికి గురవుతున్నారు. దీనికి తెరదించుతూ నాని కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటన చేయడం జరిగింది.

రేపు “గ్యాంగ్ లీడర్” మూవీ ప్రీ లుక్ ని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. రేపు ఉదయం 11గంటలకి ఏ మూవీ ప్రీ లుక్ రివీల్ చేయడంతో పాటు మిగతా వివరాలు కూడా పంచుకుంటారట. మరి ఇంకెందు ఆలస్యం రేపు నాని “గ్యాంగ్ లీడర్” గా చూడడానికి సిద్దమైపొండి.

సంబంధిత సమాచారం :

X
More