‘హిట్ 3’ తో నాని కెరీర్ రికార్డ్ ఓపెనింగ్స్ కొట్టబోతున్నాడా?

‘హిట్ 3’ తో నాని కెరీర్ రికార్డ్ ఓపెనింగ్స్ కొట్టబోతున్నాడా?

Published on Apr 30, 2025 7:00 AM IST

ఇప్పుడు మన టాలీవుడ్ ఆడియెన్స్ మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం ‘హిట్ 3’ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా విడుదల దగ్గరకి వస్తున్న సమయంలో వరల్డ్ వైడ్ గా బుకింగ్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. మెయిన్ గా యూఎస్ మార్కెట్ సహా నైజాంలో నాని కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ దసరా సినిమాకి మించిన ట్రెండ్ కనిపిస్తోంది.

ఇక ఏపీలో కూడా ఎలాగో హైక్స్ దక్కనుండగా ఈ సినిమాతో మాత్రం నాని దసరా ఓపెనింగ్స్ బ్రేక్ చేసేలానే ఉన్నాడని టాక్ వినిపిస్తుంది. మరి హిట్ 3 కి ఏ రేంజ్ ఓపెనింగ్స్ లభిస్తాయి అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా పలు క్రేజీ సర్ప్రైజ్ లు కూడా ఈ సినిమాలో ఉండనున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు