వరుస సినిమాలతో నాని బాక్సాఫీస్ దండయాత్ర

Published on Feb 25, 2020 11:04 am IST

నాచురల్ స్టార్ నాని బర్త్ డే కానుకగా నిన్న అతని 27వ చిత్రం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ దర్శకుడిగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సింగరాయ్ అనే డిఫరెంట్ టైటిల్ నిర్ణయించారు. కొద్దినెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే డిసెంబర్ 25,2020 న క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో ఈ ఏడాది నాని నుండి మొత్తం మూడు సినిమాలు విడుదల కానున్నాయి.

మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘వి’ వచ్చే నెల 25న ఉగాది కానుకగా విడుదల కానుంది. ఇక దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న టక్ జగదీశ్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం దసరా కానుకగా విదులయ్యే అవకాశం కలదు. ఇక తాజాగా నిన్న ప్రకటించిన శ్యామ్ సింగరాయ్ డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ విధంగా నాని 2020లో వరుస సినిమాలతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More