అనుపమ ప్లేస్ లో నాని హీరోయిన్ ?

Published on Sep 28, 2020 10:03 pm IST


దేవుడిని సైన్స్ ను మిక్స్ చేసి సూపర్ హిట్ కొట్టిన సినిమా ‘కార్తికేయ’. ఈ సినిమా సీక్వెల్ ప్రస్తుతం ప్లాన్ లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందు ఆ మధ్య ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ జరువుకుంది ఈ సినిమా. మొత్తానికి వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లబోతుంది. యంగ్ టాలెటెండ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో యంగ్ హీరో నిఖిల్ హీరోగా రానున్న ఈ సీక్వెల్ లో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ కూడా కీలక పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. అయితే ఆమెది హీరోయిన్ పాత్ర, లేక మరో పాత్ర అనేది ఇంకా క్లారిటీ లేదు. నిజానికి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ‘కార్తికేయ – 2 ‘ చిత్రం కోసం మొదట అనుకున్నారు. అనుపమ కూడా చేస్తానని కమిట్ అయింది. అయితే కరోనా ఎఫెక్ట్ దెబ్బకు డేట్స్ కుదరక అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా నుండి తప్పుకుందని వార్తలు వచ్చాయి.

అయితే అనుపమ నిజంగానే తప్పకుందని అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ అనుపమ తప్పుకుంటే ఆమె ప్లేస్ లో ప్రియాంకను తీసుకున్నారేమో చూడాలి. ఇక ఈ సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ గా ఉండబోతున్నాయట. ఏమైనా తన మొదటి సినిమా ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్నాడు చందు. మరి చాలా గ్యాప్ తరువాత మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి రావాలనే కసితో ఉన్నాడు. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. నిఖిల్ కూడా ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మరి నిఖిల్ కి ఈ సినిమా సూపర్ హిట్ ను ఇస్తోందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More