కృష్ణార్జున యుద్ధం ఫై నాని ఆసక్తికర ట్వీట్ !

కృష్ణార్జున యుద్ధం ఫై నాని ఆసక్తికర ట్వీట్ !

Published on May 25, 2018 8:40 PM IST

న్యాచురల్ స్టార్ నాని ద్విపాత్రభినయంలో నటించిన చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ని ఈ రోజు యప్ టీవీ మినీ థియేటర్ లో రిలీజ్ చేసారు. ప్రమోషన్ లో భాగంగా వారు నాని నటించిన సూపర్ హిట్ మూవీ కృష్ణార్జున యుద్ధ చూడండి యప్ టీవీ మినీ థియేటర్ లో అని ట్వీట్ చేసారు .

దీనికి బదులుగా నాని సూపర్ హిట్ కాదు బాబాయ్ కనీసం ఆడలేదు కాని మనుసు పెట్టి తీసాం చూసేయండి అంటూ ట్వీట్ చేసారు . ఏ విషయమైనా సూటిగా చెప్పే నాని తన సినిమా ఆడలేదు అని ఒప్పుకొవడం గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. కృష్ణార్జున యుద్ధం చిత్రాన్ని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయగా అనుపమ పరమేశ్వరన్ ,రుక్షర్ ఈ సినిమాలో కథానాయికలు గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు