ఈసారికి నాని డ్రీమ్ నెరవేరలేదు !
Published on Sep 20, 2017 3:58 pm IST


స్టార్ డైరెక్టర్ మణిరత్నం త్వరలో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముందుగా నాలుగు హీరోలని, అందులో నానిని కూడా తీసుకోనున్నారనే వార్తలు వినబడ్డాయి. కానీ ఇప్పుడు అలాంటిదేం లేదని తెలుస్తోంది. ముందుగా వినిపించిన ప్రకారం కేవలం విజయ్ సేతుపతి, శింబుల, ఫహాద్ అలీలను మాత్రమే ఫైనల్ చేశారట మణిరత్నం.

ప్రస్తుతం నాని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. మణిరత్నం సినిమాలో నటించడమనేది నాని డ్రీమ్. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో వ్యక్తపరిచారాయన. కానీ ఆ అవకాశం ఇలా చేజారిపోవడంతో కొంత నిరుత్సాహాన్ని కలిగించే విషయమే. భవిష్యత్తులోనైనా నాని కోరిక నెరవేరి మణిరత్నం సినిమాలో నటించే ఛాన్స్ వస్తుందని ఆశిద్దాం.

 
Like us on Facebook