షాక్ ఇస్తున్న నాని ‘జెర్సీ’ ప్రీ రిలీజ్ బిజినెస్ !

Published on Jan 30, 2019 9:44 am IST

‘కృష్ణార్జున యుద్ధం , దేవదాస్’ పరాజయాల ఎఫెక్ట్ నాని మార్కెట్ ను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. ప్రస్తుతం నాని, గౌతమ్ దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఇప్పటికే ఈ చిత్రం ఫై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిసినెస్ విషయానికివస్తే మొత్తం 52 కోట్లకు ఈ చిత్రం హక్కులు అమ్ముడైయ్యాయని సమాచారం. అందులో శాటిలైట్ రైట్స్ 12కోట్ల కాగా హిందీ డబ్బింగ్ రైట్స్ 6కోట్లు , ఓవర్సీస్ రైట్స్ 4కోట్లు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ 30కోట్లకు అమ్ముడైయ్యాయని టాక్.

అయితే నాని కి ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ వుంది. ఇక ఈచిత్రం నాని కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది. మరి నాని ఈ చిత్రంతో ఇంత భారీ మొత్తాన్ని వెనక్కు తీసుకువస్తాడో లేదో చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :