‘జెర్సీ’ లేటెస్ట్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

Published on May 16, 2019 7:54 pm IST

ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో డీసెంట్ టాక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో ‘జెర్సీ’ ముందు వరుసలో ఉంటుంది. మరి అలాంటి జెర్సీకి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చి ఉంటాయి ?. వరల్డ్ వైడ్ గా ‘జెర్సీ’ మొత్తం 35 కోట్ల రూపాయల షేర్ ను కలెక్ట్ చేసింది.

అయితే క్లాసిక్ హిట్.. డీసెంట్ హిట్ అంటూ కీర్తించబడిన ‘జెర్సీ’, తన స్థాయి తగ్గ కలెక్షన్స్ ను రాబట్టకపోయినా.. కేవలం 24 కోట్ల ప్రీ బిజినెస్ చేయడం కారణంగా ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద జెర్సీ మంచి విజయాన్ని సాధించింది.

గౌతమ్ దర్శకత్వంలో నాని హీరో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా నాని కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలుస్తోంది. మొత్తానికి ‘జెర్సీ’ సాధారణ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులను కూడా బాగా మెప్పించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం :

More