నాని మల్టీ స్టారర్ లాంచ్ డేట్ ఖరారు !

Published on Apr 28, 2019 11:54 am IST

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు కలిసి నటించనున్న మల్టీ స్టారర్ రేపు లాంచ్ కానుందని సమాచారం. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి,నివేత థామస్ కథానాయికలుగా నటించనున్నారు. అయితే వీరు ఏ హీరో కు జోడీగా నటిస్తారో క్లారిటీ రావాల్సి వుంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు.

ఇక ఈ చిత్రం యొక్క టైటిల్ లోగో కూడా రేపు విడుదలకానుంది. డిసెంబర్ చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :