దసరా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న నాగ్ – నానిల మల్టి స్టారర్ చిత్రం !

Published on Jul 1, 2018 6:48 pm IST

‘భలే మంచి రోజు’ చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సీనియర్ స్టార్ హీరో నాగార్జున మరియు సహజ నటుడు నాని కలిసి మల్టీ స్టారర్ లో చిత్రంలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే.

శరవేగంగా చిత్రకరణను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా బరిలో నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్ర దర్శక నిర్మాతలు.పక్క ఎంటర్టైనర్ గా తెరెకెక్కుతున్న ఈచిత్రంలో నాని కి జోడిగా రష్మిక మండన్న నటిస్తుండగా, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :