నాని లుక్ సరికొత్తగా ఉందే..!

Published on Dec 8, 2019 6:07 pm IST

టాలీవుడ్ లో మినిమమ్ గ్యారంటీ హీరోలలో నాని ఒకరు. గత కొన్నేళ్లుగా ఆయన వరస విజయాలు అందుకుంటున్నారు. గ్యాంగ్ లీడర్ మూవీ నుండి సినిమాల ఎంపిక విషయంలో వైవిధ్యం చూపిస్తున్నారు. తాజాగా నాని కి సంబందించిన ఓ ఫోటో బయటికి రాగా అందులో ఆయన లుక్ భిన్నంగా ఉంది. గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా నాని బాగా పెరిగిన గడ్డం మెలితిప్పిన మీసంలో కనిపించారు. ప్రస్తుతం నాని ‘వి’ అనే చిత్రంలో చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు మొదటిసారి హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం.గతంలో వచ్చిన అష్టా చెమ్మా, జెంటిల్ మెన్ చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి.

‘వి’ చిత్రంలో నాని సీరియల్ కిల్లర్ గా నటిస్తున్నారు. మరి పాత్ర కోసం నాని ఇలా మీసం తిప్పిన గెటప్ తో సిద్ధమయ్యారా అనే అనుమానం కలుగుతుంది. కాగా ఇటీవలే నాని.. దర్శకుడు శివ నిర్వాణ తో ‘టక్ జగదీశ్’ అనే ఓ చిత్రాన్ని ప్రకటించడంతో పాటు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ‘టక్ జగదీశ్’ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More