నాని ప్లాన్ మామూలుగా లేదుగా

Published on Feb 23, 2020 8:35 pm IST

‘అ !’ సినిమాతో నిర్మాతగా మారిన హీరో నాని నిర్మిస్తున్న రెండవ చిత్రం ‘హిట్’. ఇందులో హీరోగా ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. టీజర్, ట్రైలర్లతో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ థ్రిల్లర్ ఈ నెల 28న విడుదలకానుంది. దీంతో నిర్మాత నాని ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. అది కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం నిర్వహించనున్న ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిధులుగా ఇద్దరు స్టార్లను ఆహ్వానించారు నాని.

వాళ్లే డైరెక్టర్ రాజమౌళి, లేడీ సూపర్ స్టార్ అనుష్క. అనుష్క, జక్కన్నలతో నానికి చాలా మంచి స్నేహం ఉంది. అందుకే నాని ఆహ్వానం మేరకు వారిద్దరూ కార్యక్రమానికి వస్తున్నారు. ఈ భారీ ఈవెంట్ కారణంగా సినిమా మరింత బలంగా జనాల్లోకి వెళ్లనుంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో విశ్వక్ సేన్ ఐపీఎస్ విక్రమ్ రుద్రరాజుగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో కథానాయకిగా రుహాని శర్మ కథానాయకిగా కనిపించనుంది.

సంబంధిత సమాచారం :

X
More