చై, సమంతల సినిమాను నిర్మించనున్న నాని నిర్మాతలు !

12th, February 2018 - 12:49:24 PM

స్టార్ కపుల్ నాగ చైతన్య, సమంతలు పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటించనున్నారు. ‘నిన్ను కోరి’ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన రొమాంటిక్ ప్రేమ కథ నచ్చడంతో ఈ ఇద్దరూ కలిసి నటించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ స్క్రిప్ట్ గనుక బాగుంటే తప్పకుండా సమంత, చైతూలు కలిసి నటించడం ఖాయం.

ఇకపోతే ఈ సినిమాను ప్రస్తుతం నానితో ‘కృష్ణార్జున యుద్ధం’ అనే సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలు నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబందించిన నటీనటులు, సాంకేతిక్ నిపుణులు, ఇతర వివరాలన్నీ త్వరలోనే అధికారికంగా ప్రకటితం కానున్నాయి.