ల్యాండ్ మార్క్ మూవీ కోసం నాని సిక్స్ బాడీ…!

Published on Aug 7, 2019 11:58 am IST

నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన ” గ్యాంగ్ లీడర్” మూవీ వచ్చే నెల విడుదల కానుంది. ఈనెల 30న విడుదల కావాల్సివుండగా కొన్ని అనివార్య కారణాల వలన విడుదల వాయిదా వేయడం జరిగింది. ఈ మూవీలో నాని పెన్సిల్ అనే పెన్ నేమ్ కలిగిన రివేంజ్ డ్రామా రైటర్ గా కనిపించనున్నారు. దర్శకుడు విక్రమ్ కుమార్ రొమాంటిక్ కామెడీ మరియు యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.

ఐతే నాని తన 25వ చిత్రం విలక్షణ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. “వి” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ లుక్ పోస్టర్ కూడా గతంలో విడుదల చేయడం జరిగింది. నాని ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన సీరియల్ కిల్లర్ రోల్ చేస్తున్నారని సమాచారం. హీరో సుధీర్ కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో అదితిరావ్ హైదరి, నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఐతే ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. నాని సిల్వర్ జూబ్లీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం నాని సిక్స్ ప్యాక్ బాడీ రెడీ చేస్తున్నాడట. అందుకోసం ఆయన రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారని సమాచారం. కథరీత్యా నాని కి ఇలాంటి మేకోవర్ అవసరం కావడంతో నాని సిక్స్ ప్యాక్ కొరకు కష్టపడుతున్నాడని సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం కలదు

సంబంధిత సమాచారం :