నాని ‘జెర్సీ’కి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదా ?

Published on Oct 29, 2018 3:30 pm IST

‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో సహాజ నటుడు నాని తన 23వ చిత్రం ‘జెర్సీ’ లో నటిస్తున్నాడు. దసరా రోజు ప్రారంభమైన ఈచిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా కోసం నాని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. సినిమా మంచి క్వాలీటీ తో రుపొందాలని నాని ఈ చిత్రానికి పారితోషకం వద్దన్నాడట. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రానికి విజువల్స్ కీలకం కానున్నాయి. దాంతో వీఎఫ్ఎక్స్ క్వాలిటీ బాగుండాలని నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో నాని క్రికెటర్ గా అర్జున్ పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :