రానా దగ్గుబాటి ప్లేస్ లో నాని.!

రానా దగ్గుబాటి ప్లేస్ లో నాని.!

Published on Sep 25, 2014 5:42 PM IST

Nani1
యంగ్ హీరో నాని బయట ఈవెంట్స్ లో కనిపిస్తున్నా, ముఖానికి మేకప్ వేసుకొని, కెమెరా ముందుకు వచ్చి మాత్రం చాలా కాలమే అయిపొయింది. ‘జెండా పై కపిరాజు’ తర్వాత నాని సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చాడు. ఇటీవలే ‘స్టూడెంట్ నెం 1’ తో ఎస్ఎస్ రాజమౌళి ని పరిచయం స్వప్న సినిమాస్ బ్యానర్ లో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా ద్వారా నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

తాజా సమాచారం ప్రకారం నాని మరో సినిమాకి సైన్ చేసాడు. అదే అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్న ‘కవచం’. ముందుగా ఈ సినిమా కోసం రానా దగ్గుబాటిని ఎంపిక చేసారు. కానీ రానా బాహుబలి, రుద్రమదేవి, బేబీ, వన్ నైట్ స్టాండ్ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల కవచం సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక రానాకి కుదరకపోవడంతో కవచంలో హీరోగా నానిని ఫైనలైజ్ చేసారు.

ప్రస్తుతం కథలో నాని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సురేష్ బాబు నిర్మాత. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగానే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది.

తాజా వార్తలు