‘సింగ్ గీతం’పై నాని ఫిదా.. వారికి తప్పక చూపించాల్సిందే..!

‘సింగ్ గీతం’పై నాని ఫిదా.. వారికి తప్పక చూపించాల్సిందే..!

Published on Jun 13, 2026 10:35 PM IST

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో అందించిన వినూత్న ప్రయోగం ‘సింగ్ గీతం’ చిత్రానికి ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను చూసిన స్టార్స్ సెలబ్రిటీలు సైతం సింగీతం ట్యాలెంట్‌కు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ సినిమాపై తన రెస్పాన్స్‌ను పంచుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని.

గొప్ప ఆలోచనలు బుర్ర నుంచి కాదు, హృదయం నుంచి వస్తాయని ఈ సినిమా మరోసారి నిరూపించిందని, ఈ అద్భుతాన్ని సాకారం చేసిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం గారికి, నిర్మాత నాగ్ అశ్విన్‌కు, వైజయంతీ మూవీస్ బృందానికి అభినందనలు తెలిపాడు నాని. ఈ చిత్ర నిర్మాణంలో, ప్లానింగ్‌లో కీలక పాత్ర పోషించి.. సినిమాను అనుకున్న విధంగా స్క్రీన్‌పైకి తీసుకురావడంలో ‘జూనియర్ సుబ్బు’ సంకల్ప్ చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించాడు. పరిమిత బడ్జెట్‌తో సరికొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్ అద్భుతమైన ఔట్‌పుట్ ఇచ్చిందని, ఈ తరం సినిమాకు ఇదొక గొప్ప ట్రిబ్యూట్ అని నాని తెలిపాడు.

దయచేసి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ సినిమాకు తీసుకువెళ్లండని.. మీ పిల్లల కోసం మరియు మీలోని ఆ పసితనాన్ని మళ్లీ మేల్కొల్పడం కోసం ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లలో చూడండి అంటూ నాని ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు