‘హిట్’ సినిమాలో నటించకపోవడానికి కారణం బయటపెట్టిన నాని

Published on Feb 27, 2020 9:51 pm IST

నాని నిర్మాతగా తెరకెక్కిన రెండవ చిత్రం ‘హిట్’. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని పనుల్ని పూర్తి చేసుకుని ఫిబ్రవరి 28న విడుదలకానుంది. టీజర్, ట్రైలర్లతో ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ చిత్రం టాలీవుడ్ థ్రిల్లర్ జానర్ సినిమాల్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని నాని అంటున్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను కథ చెప్పిన తీరు, ఫిల్మ్ మేకింగ్ మీద ఆయనకున్న నాలెడ్జ్ చూసి వెంటనే సినిమాను ప్రొడ్యూజ్ చేయడానికి ముందుకొచ్చానని అన్నారు.

ఇంత మంచి కథలో తానెందుకు నటించలేదు అనే విషయాన్ని చెబుతూ తాను లీడ్ రోల్ చేస్తే ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మారిపోతాయని, అలా చేసి కథను దెబ్బతీయడం ఇష్టంలేక తాను చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక విశ్వక్ సేన్ అయితే ఈ తరహా సినిమాలో నటించడం ఇదే మొదటిసారని అన్నారు. ఈ చిత్రంలో రుహాని శర్మ కథానాయకిగా నటిస్తోంది. ఇందులో విశ్వక్ సేన్ ఐపీఎస్ విక్రమ్ రుద్రరాజుగా కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :