బ్రేక్ లేకుండా డేర్ చేసిన “టక్ జగదీష్”.!

Published on Oct 23, 2020 7:34 am IST

తన ప్రతీ సినిమాకు కూడా కేవలం పెర్ఫామెన్స్ తో మాత్రమే కాకుండా మంచి కంటెంట్ తో కూడా ఆకట్టుకుంటాడు నాచురల్ స్టార్ నాని. అలా ఇటీవలే కాలంలో మంచి సబ్జెక్టులతో పలకరించిన నాని ఇప్పుడు తన హిట్ దర్శకుడు శివ నిర్వాన దర్శకత్వంలో “టక్ జగదీష్” అనే ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే చాలా వరకు షూట్ ను జరుపుకున్న ఈ చిత్రం ఇటీవలే లాక్ డౌన్ అనంతరం మళ్ళీ మొదలయ్యింది.

కానీ అలా మొదలైన కొద్ది లోనే చిత్ర యూనిట్ కు చెందిన ఒక వ్యక్తికి కరోనా రావడంతో తాత్కాలికంగా బ్రేక్ వేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ తక్కువ సమయంలోనే షూట్ ను మొదలు పెట్టేసినట్టుగా దర్శకుడు తెలిపారు. తగిన కేర్ తీసుకొని సెట్ ను మొత్తం శానిటైజ్ చేస్తూ ఒక వీడియో ద్వారా తెలిపి ఇక నుంచి ఎలాంటి బ్రేక్ లేకుండా డేర్ తో షూట్ ను పూర్తి చెయ్యాలని పూనుకున్నారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More