చిరంజీవికి హీరో నాని ప్రత్యేక శుభాకాంక్షలు.

Published on Aug 22, 2019 7:07 pm IST

నేడు చిరు జన్మదినం సందర్భంగా అటు అభిమానులతో పాటు, ఇటు ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. నిన్న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పవన్ అతిధిగా ఓ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాగా హీరో నాని తాజాగా గ్యాంగ్ లీడర్ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ టైటిల్ ఒకప్పటి చిరు బ్లాక్ బస్టర్ మూవీ కావడంతో ఆపేరున ఉద్దేశింది నాని ప్రత్యేకంగా విషెస్ చెప్పారు.

“మా సినిమాలోని ఈ షాట్.. క్లాసిక్ గ్యాంగ్ లీడర్‌కు ఓ ట్రిబ్యూట్ లాంటిది. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ఆ షాట్‌ను పోస్టర్ రూపంలో విడుదల చేస్తున్నాం. హ్యాపీ బర్త్‌డే సర్. మేమంతా స్ఫూర్తి పొందుతున్న నిజమైన గ్యాంగ్ లీడర్ మీరు” అని నాని ట్వీట్ చేశాడు.

సంబంధిత సమాచారం :