‘ఏబిసిడి’ హీరోయిన్ని పొగిడిన ‘నాని’ !

Published on May 14, 2019 6:10 pm IST

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్‌టైనర్‌ ‘ఏబీసీడీ’. ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ ట్యాగ్‌ లైన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమాకు క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ చేస్తున్నారు.

కాగా సోమ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. నేచుర‌ల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా నాని మాట్లాడుతూ… ‘నాకు ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. శిరీష్ కు ఆల్ ది వెరీ బెస్ట్‌. త‌న కెరీర్‌కు సంబంధించి ఏబీసీడీలు ఎప్పుడో స్టార్ట్ చేసిన శిరీష్‌, త‌న స్టార్ డ‌మ్‌ కు సంబంధించిన ఏబీసీడీలు ఈ సినిమాతో స్టార్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను. ద‌ర్శ‌కుడు సంజీవ్‌ కి ఆల్ ది వెరీ బెస్ట్‌. రుక్స‌ర్ మంచి పెర్ఫామ‌ర్‌. త‌న‌కు కూడా ఆల్ ది వెరీ బెస్ట్‌ అని అన్నారు.

సంబంధిత సమాచారం :

More