ప్రమోషన్ల జోరు పెంచిన యంగ్ హీరో!

Nani
టాలీవుడ్ లోని యంగ్ హీరోల్లో సరికొత్త, భిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి విజయాలు సాధిస్తున్నాడు ‘నాని’. గత ఏడాది ఆయన చేసిన నాలుగు సినిమాలు వరుస సక్సె లు సాధించాయి. దీంతో ప్రస్తుతం నాని మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. తాజాగా ఆయన నటించిన ‘నేను లోకల్’ చిత్రం ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. విడుదలకు ఇంకో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్లపై దృష్టి పెట్టాడు నాని.

సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు స్వయంగా రంగంలోకి దిగాడు. మొన్న హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ కు వెళ్లి ప్రజలతో ముచ్చటించిన ఆయన ఈరోజు అన్ని టీవీ, ప్రింట్, వెబ్ మీడియాలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక టీమ్ కూడా చిత్రం యొక్క నిముషం నిడివి ఉన్న వీడియో పాటలను సోషల్ నెట్వర్క్లలో విడుదల చేస్తూ ప్రచారం సాగిస్తోంది. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండటం, ఇప్పటికే ట్రైలర్, ఆడియోకు మంచి స్పందన రావడంతో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. త్రినాథ్ రావ్ నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పాపులర్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

Exit mobile version