
దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా రొమాంటిక్ సినిమాల స్పెషలిస్ట్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘ఒకే కన్మణి’. తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో అనువదిస్తున్నారు. ఈ సినిమాలో హీరో పాత్రకు నాని డబ్బింగ్ చెప్తున్నారు.
‘కెరీర్లో మొదటిసారి మరో మరో హీరోకు నా వాయిస్ ఇస్తున్నాను. లెజెండ్ నుండి ఫోన్ వస్తే.. కాదని ఎలా అనగలం. ఫైనల్లీ… మణిరత్నం గారితో కలిసి పని చేసే అవకాశం లభించింది. గెట్ రెడీ ఫర్ న్యూ ఏజ్ సఖి. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ‘ఓకే బంగారం’ ట్రైలర్ విడుదలవుతుంది. అని నాని సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోను మార్చి రెండవ వారంలో విడుదల చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

