‘శ్యామ్’ నుంచి ‘సుందరానికి’ ట్రాన్స్ఫార్మ్ అయిన నాని.!

Published on Jul 27, 2021 9:00 am IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ప్రస్తుత సినిమాల్లో దర్శకుడు శివ నిర్వాణతో ప్లాన్ చేసిన చిత్రం “టక్ జగదీష్” అల్రెయ్ రిలీజ్ కి రెడీ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. మంచి అంచానాలు నెలకొల్పుకున్న ఈ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కంప్లీట్ చేస్తూనే మార్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తో స్టార్ట్ చేసిన భారీ ప్రాజెక్ట్ “శ్యామ్ సింగ రాయ్”. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది.

అందుకే మంచి అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ సినిమాని కూడా నాని కంప్లీట్ చేసేసి తాను ప్రాజెక్ట్ “అంటే సుందరానికి” మేకోవర్ లోకి సింపుల్ గా మారిపోయినట్టు పోస్ట్ చేసాడు. దానికి సినిమాల్లా మంచి ఫ్రెష్ అండ్ యంగ్ లుక్ లోనే కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :