ఈ ఏడాది ఒక మర్చిపోలేని సంవత్సరం అందరికీ..దీనితో ఒక్కసారిగా అందరి జీవితాలు మారిపోయాయి. ఇక ఇదిలా ఉంటే సినీ రంగానికి కూడా గట్టి దెబ్బే తగిలింది. దీనితో అనేక సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కే ఊ కొట్టాయి. వాటిలో మన తెలుగు సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.
అయితే మన తెలుగు నుంచి వచ్చిన చిత్రాల్లో ఓటిటి రిలీజ్ కే భారీ హైప్ ను తెచ్చుకున్న కొన్ని చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని యాంటీ హీరోగా సుధీర్ బాబు మరో హీరోగా నటించిన క్రైమ్ యాక్షన్ డ్రామా “వి” ఒకటి. అయితే ఈ సినిమా ఎంత హైప్ తో అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యిందో ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.
దీనితో నాని 25వ సినిమా అంతగా వర్కౌట్ కాలేదని అంతా అనుకున్నారు. కానీ నాని మరియు మోహన కృష్ణ ఇంద్రగంటిల కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఈ ఏడాది ఓటిటిలో విడుదల కాబడిన మొత్తం ఇండియన్ సినిమాల టాప్ 10 మోస్ట్ వ్యూడ్ సినిమాల జాబితాలో నిలవడం విశేషం.
ఈ చిత్రానికి ఈ జాబితాలో 9వ స్థానం దక్కడమే కాకుండా ఈ మొత్తం లిస్ట్ లో మన తెలుగు నుంచి ఈ ఒక్క సినిమానే ఉండటం గమనార్హం. ఇలా ఈ ఏడాది ఇండియన్ సినిమా లిస్ట్ లో ఓ ప్లాప్ సినిమాతో కూడా ఇలాంటి ఫీట్ సెట్ చెయ్యడం నాని సినిమాకు స్పెషల్ అనే చెప్పాలి.


