న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘హిట్-3’ మూవీ ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాడు. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని విధ్వంసాన్ని సృష్టించబోతున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాని పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.
ఆయన త్వరలో దర్శకుడు సుజిత్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్న విషయాన్ని గతంలోనే వెల్లడించారు. అయితే, ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంపై నాని తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఓజి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు కొంతమేర షూటింగ్ పెండింగ్ ఉండటంతో ఆ సినిమాను ఆయన పూర్తి చేసిన తర్వాత సుజిత్ ఫ్రీ అవుతాడు. ఓజి పనులు పూర్తయ్యాక నాని సినిమాపై సుజిత్ వర్క్ స్టార్ట్ చేస్తాడని నాని తెలిపారు.
దీంతో పవన్ ముగిస్తే, నాని ప్రారంభిస్తాడు అనేది స్పష్టం అయింది. ఇక హిట్-3 మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.