నాని 24 టైటిల్ ఇదేనా ?

Published on Feb 23, 2019 6:24 pm IST


న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న 24వ చిత్రం యొక్క టైటిల్ ను రేపు సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ ఇదే నంటూ ప్రచారం జరుగుతుంది. మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లో కల్ట్ మూవీ గా నిలిచింది గ్యాంగ్ లీడర్. ఇప్పుడు ఇదే టైటిల్ ను నాని సినిమా కి పెడుతున్నారట. అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో ఆరుగురు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం. ప్రముఖ డీఓపీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :