జెర్సీ తో నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టుకొనేలా ఉన్నాడు !

జెర్సీ తో నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టుకొనేలా ఉన్నాడు !

Published on Apr 19, 2019 4:00 PM IST

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నాని నటించిన తాజా చిత్రం జెర్సీ ఈరోజు విడుదలై క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ఇక మౌత్ టాక్ కూడా అలాగే ఊడడం తో మొదటి రోజు ఈ చిత్రం భారీ ఓపెనింగ్ ను రాబట్టుకునేలా వుంది. అడ్వాన్స్ బుకింగ్స్ బాగుండడం అలాగే 1000 కి పైగా స్క్రీన్ లలో విడుదలకావడం కూడా ఈ చిత్రానికి కలిసి రానుంది. మరి ఈచిత్రం నాని కెరీర్ లో హైయెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టిస్తుందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రం లో నాని సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు